Friday, December 20, 2024

మెరిట్ స్కాలర్‌షిప్‌కు గడువు పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

Application date extended for Means com merit scholarship

మనతెలంగాణ/హైదరాబాద్: ఎనిమిదో తరగతికి సంబంధించి నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు, పరీక్ష ఫీజు తేదీల చెల్లింపునకు గడువు పొడిగించారు. ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పించేందుకు, పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఆన్‌లైన్ రిజిస్టర్డ్ దరఖాస్తు ఫారంతో సంబంధిత నమోదు పత్రాలు జిల్లా విద్యా అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. బిసి/ఎస్సీ/ఎస్టీల విషయంలో కుల ధృవీకరణ పత్రాల ధృవీకరణ నకలు, దివ్యాంగుల అభ్యర్థుల విషయంలో వైద్య ధృవీకరణ పత్రాలు జతపరచాలి. అభ్యర్థులు తప్పక ఆదాయ ధృవీకరణ పత్రం జతచేయాలి. మరిన్ని వివరాలకు www.bse.telangana.gov.inలో సంప్రదించాలని కోరారు.

Application date extended for Means com merit scholarship

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News