Friday, November 22, 2024

జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఒప్పంద ప్రాతిపదికన 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్స్/ డ్రాయింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఐటి, సిఎస్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా బిఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉండాలని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 30 తేదీలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపిం చాలని అధికారులు తెలిపారు. జనరల్ కేటగిరీకి చెందిన వారు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి/మహిళా అభ్యర్ధులు రూ.250 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలని, అకాడమిక్ మెరిట్ మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ, ఇంటెలిజెన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.25,000ల నుంచి రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News