హైదరాబాద్: విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలతో పాటు ఆరవ తరగతి నుండి 8వ తరగతి వరకు బ్యాక్‌లాగ్ ఖాళీలు భర్తీ చేయడానికి మైనారిటీలు, నాన్ మైనారిటీ విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బి.షఫిఉల్లా ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు మైనారిటీలతో పాటు నాన్ మైనారిటీలు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు.
6వ తరగతి నుండి 8వ తరగతి వరకు బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి గాను కేవలం మైనారిటీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు టెమ్రీస్ అధికారిక వెబ్‌సైట్ www.tmreis.telangana.gov.in లేదా టెమ్రీస్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఎస్‌ఎస్‌సి 2023 జిపిఎ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించబడుతాయని తెలిపారు.
తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నెల 30 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.