Thursday, December 26, 2024

15 వరకు మోడల్ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తు గడువు

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : సదాశివనగర్ మోడల్ స్కూల్లో ఆరో తరగతి తో పాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు సంభందించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు కోసం ఫిబ్రవరి 15 వరకు గడువు ఉన్నట్లు ప్రిన్సిపాల్ భానుమతి ప్రకటన ద్వారా తెలిపారు. మోడల్ స్కూళ్లో ఆంగ్ల మాద్యమంలో భోదన ఉంటుందని అన్నారు. ఆరో తరగతిలో వంద సీట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

ఓసీలు రూ,200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికాలాంగులు, ఈడబ్లూస్ విద్యార్థులు రూ, 125 దరఖాస్తు ఫీజు చెల్లించాలని సూచించారు. ఇతర వివరాల కోసం www.tsmodelschool.com వెబ్‌సైట్ ను సంప్రదించాలని తెలిపారు. ఇప్పటి వరకు 558 దరఖాస్తులొచ్చాయని వివరించారు. 6వ తరగతిలో (351) 7 వ తరగతిలో (93) 8 వ తరగతిలో (57) 9 వ తరగతిలో (49) 10 వ తరగతిలో 8 అప్లికేషన్లు వచ్చాయని ప్రిన్సిపాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News