జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఇబిసి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్ కం మెయిన్స్ ఉచిత శిక్షణకు ఈ నెల 10న ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.gov.in/tsbcw.index.do లో ఈ నెల 16న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించబడునని సూచించారు. శిక్షణ తరగతులు 2023 జూలై 31 నుంచి 2024 ఏప్రిల్ 3 వరకు బిసి స్టడీ సర్కిల్, ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్, ఒయు క్యాంపస్, తార్నాక, హైదరాబాద్‌లో ప్రారంభమవుతాయని తెలియజేశారు. హైదరాబాద్‌లోని ఒయు సెంటర్‌లో మొత్తం 150 మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులను 50 నేరుగా, 100 ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారని,
లాడ్జింగ్, బోర్డింగ్ రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ.5 వేలు చెల్లింబడునని పేర్కొన్నారు. లైబ్రరీ సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు. 31 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి గతంలో సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ ఎగ్జామినేషన్, 2024 ఉచిత కోచింగ్‌లో డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వబడునని, ఇందుకోసం బిసి స్టడీ సర్కిల్, ఒయు సెంటర్, హైదరాబాద్‌లో సంబంధిత పత్రాలతో 2023 జూలై 10లోపు నేరుగా అప్లికేషన్ సమర్పించవచ్చని తెలిపారు. పరీక్ష ఫలితాలు 2023 జూలై 21న వెల్లడించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 040 27077929, 7780359322లో సంప్రదించాలని సూచించారు.