- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలోని బిసిలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నుంచి ప్రభుత్వ సాయం కింద రూ. లక్ష సాయం పంపిణీ చేయనుంది. బిసిల్లోని కులవృత్తులు, చేతివృత్తులకు రూ. లక్ష ప్రభుత్వం సాయం చేయనుంది సర్కార్. ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదగా మంచిర్యాల జిల్లాలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తు వైబ్ సైట్ ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. https://tsobmmsbc.cgg.gov.in వైబ్ సైట్ ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో అప్లికేషన్ ను వెంటనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. కృలవృత్తి, చేతివృత్తులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు సాయం చేయనుంది.
- Advertisement -