Monday, December 23, 2024

గృహలక్ష్మి పథకానికి ఆగస్టు 10లోగా దరఖాస్తు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న పేద గృహిణులు, ఒంటరి మహిళలు గృహలక్ష్మి ద్వారా సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇళ్లు లేని పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయల ఆర్థిక సహా యం వంద శాతం సబ్సిడిపై మంజూరు చేసి సొంత ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారుల ను ఎంపిక చేసి లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలో ఈ పథకం అమలు ఉంటుందని తెలిపా రు. సొంత స్థలం ఉండి ఇళ్లు లేని నిరుపేద కుటుంబ మహిళల పేరున, ఒంటరి మహిళల పేరున ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రెండు గదుల ఇళ్లు ఆర్‌సిసితో నిర్మాణం, తనకు నచ్చిన డిజైన్‌లో ఇళ్లు కట్టుకోవచ్చని, అయితే ఈ పథకం లబ్ధిదారుల ఇంటిపై గృహలక్ష్మి లోగో పెట్టడం జరుగుతుందన్నారు.

ఒక నియోజకవర్గం లో 3 వేల కంటే ఎక్కువ అర్హత కలిగిన దరఖాస్తులు వస్తే ఇంచార్జి మంత్రి ద్వారా 3 వేల మంది అర్హుల జాబితా తయారు చేసి వారికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన వారి పేర్లు వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టడం జరుగుతుందని, మూడు లక్షల రూపాయలు మూడు విడతల్లో విడుదల చేయడం జరుగుతుందని, ఒక్కో విడతలో లక్ష రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

అందువల్ల అర్హత కలిగిన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాల పేద మహిళలు తగిన ఆధారాలతో ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆగష్టు 10లోపల దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే స్క్రూటినీ చేసే విధంగా తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు తగు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News