Monday, January 13, 2025

పకడ్బందీగా దరఖాస్తుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఈనెల 31నాటికి పరిశీలన
పూర్తి, అనంతరం
యాప్‌లో సర్వే వివరాలు
14న సంక్షేమ హాస్టల్
విద్యార్థులతో సహపంక్తి
భోజనాలు సామాజిక
సర్వే 99.09శాతం పూర్తి
రేపటితో సర్వే ముగింపు
గ్రూప్2కు విస్తృత ఏర్పాట్లు
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి పొంగులేటి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సం బంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్భందీగా చేపట్టాలని రెవెన్యూ ,హౌసింగ్. సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్ -2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీలపెంపు, సామాజిక సర్వే తదితర అంశాలపై బుధవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31వతేదీ లోగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.

పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చే యాలని, ప్రతి ఐదు వందల దరఖాస్తులకు ఒక ఉ ద్యోగి (సర్వేయర్)ను నియమించుకోవాలని మం త్రి పొంగులేటి సూచించారు. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాల ని,రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏ ర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి, ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయాలని మంత్రి పే ర్కొన్నారు. అంతేకాకుండా స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్టకుండా చిన్న చిన్న పొరపాట్ల కు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు.సర్వే వివరాల గురించి ప్రతిరోజు కలెక్టర్‌లు సమీక్షించాలని, ప్రతి జి ల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇ ళ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియ అని, ఈ ఏడాది 4.5 లక్ష ల ఇళ్లను నిర్మించబోతున్నామని కలెక్టర్‌లకు సూచించారు.

7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీలను ఒక్కసారి కూడా పెంచలేదన్నారు. తమ ప్రభుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్‌ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం వల్ల 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. కలెక్టర్లు తరచూ హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులకు అందించే సరుకుల నాణ్యత, పరిమాణంపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.
ఇప్పటివరకు 99.09% సామాజిక సర్వే పూర్తి
ఈనెల 14వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు స్థానికంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడే విద్యార్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని ఆయన సూచించారు.

సామాజిక సర్వే రాష్ట్రంలో కోటి 16 లక్షల కుటుంబాలకు గాను కోటి 12 లక్షల కుటుంబాల సామాజిక సర్వే (99.09 శాతం)ను పూర్తిచేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. దీనికి కృషి చేసిన అధికారులకు ముఖ్యమంత్రి తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈనెల 13వ తేదీ సామాజిక సర్వేకు తుదిగడువుగా మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రజా పాలన సేవా కేంద్రాల్లో కూడా కుటుంబ సర్వే వివరాలను నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈనెల 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News