Thursday, January 23, 2025

నర్సింగ్ ఉద్యోగాలకు 12 నుండి దరఖాస్తు చేసుకోవాలి : టామ్ కామ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ టామ్ కామ్ వివిధ దేశాల్లో నర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని నిర్దిష్ట నర్సింగ్ , సంబంధిత ఉద్యోగ అవకాశాల గురించి సమాచారాన్ని అందించడానికి తెలంగాణలోని వివిధ జిల్లాలలో నమోదు డ్రైవ్ కమ్ వర్క్ షాపులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 12న హైదరాబాద్ బోయిగూడలోని నర్సింగ్ కళాశాలలోనూ, 14న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు కార్యాలయంలోనూ, 15న రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతి నగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోనూ,

16న కరీంనగర్ జిల్లా బొమ్మకల్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ ( చల్మెడ ఆనంద్‌రావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లోను నిర్వహించే డ్రైవ్‌కు అభ్యర్థులు తమ రెస్యూమ్‌లు, సంబంధిత డాక్యుమెంట్లలతో హాజరు కావాల్సిందిగా టామ్ కామ్ తెలిపింది. మరిన్ని వివరాలకు టామ్ కామ్ డాట్ తెలంగాణ డాట్ జిఓవీ. ఇన్‌లో గానీ, లేదా 6302292450 ఫోన్ నెంబర్‌లో గానీ సంప్రదించాలని టామ్ కామ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News