Sunday, January 19, 2025

ఈనెల 14వ తేదీలోపు ఓయూలో పిహెచ్‌డీకి దరఖాస్తుల అవకాశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఉస్మానియా యూనివర్శిటీ వివిధ విభాగాల్లో పీహెచ్ ప్రవేశాలకు ఆగస్టు 14వ తేదీ లోపు దరఖాస్తులను విభాగాల డీన్ కార్యాలయాల్లో అందజేయాలని ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్-జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ క్వాలిఫై అయిన వారు, దేశంలోని గుర్తింపు పొందిన సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్ పొందిన వారు ఈ పీహెచీకి దరఖాస్తు చేయడానికి అర్హులు. ఆర్ట్, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్,

ఇన్ఫర్మేటిక్స్, లా, మేనేజ్‌మెంట్ , ఫార్మసీ, సైన్స్, సోషల్ సైన్సెస్, టెక్నాలజీ, ఓరియంటల్ లాంగ్వేజెస్ విభాగాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు క్వాలిఫై అయి వారు అర్హులని తెలిపారు. వీరితో పాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్ పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News