Monday, December 23, 2024

పాలిసెట్‌కు దరఖాస్తుకు ఈ నెల 24 వరకు గడువు

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ : ఈ నెల 24వ తేదీలోపు పాలిసెట్‌కు దరఖాస్తులు చేసుకోవాలని ఖేడ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జి.మల్లయ్య తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ రకాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ 2023 పరీక్షకు ఈ నెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు వ్రాసిన వారు, ఇంతకు ముందు పదో తరగతి పూర్తైన వారు పాలిసెట్ రాయడానికి అర్హులన్నారు. www.polycet.sbtet.telangana.govt.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News