Monday, December 23, 2024

టీచర్ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వికలాంగుల ఆశ్రమ పాఠశాలల్లో తాత్కాలిక పద్దతిలో భర్తీ చేయనున్న టీచర్ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగించారు. వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బధిరులు, అంధుల ఆశ్రమ పాఠశాలల్లో తాత్కాలిక పద్దతిలో ఎస్‌జిటి, టిజిటి పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు జూన్ 14తో ముగిసింది. ఈ గడువును జూన్ 20 వరకు పొడిగించినట్లు ఆ శాఖ డైరెక్టర్ బి. శైలజ ఒక ప్రకటలో తెలిపారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.wdsc.telangana.gov.in ను సందర్శించాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News