Wednesday, January 22, 2025

బి ఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అటవీ కళాశాల , పరిశోధన సంస్థ విద్యా సంవత్సరం 202324 నకు బి ఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేయడానికి ఈ నెల 14 నుండి సూచించిన దరఖాస్తు ఫారం కళాశాల వెబ్ సైట్ www.fcrits.inలో నింపి దరఖాస్తు ఫారమ్‌కు కావాలసిన సర్టిఫికెట్ కాపీలు అప్లోడ్ చేసుకోవాలని తెలిపింది.

కాగా దరఖాస్తు రుసుం ఆన్‌లైన్లో రూ. 1000 , ఎస్‌సి, ఎస్‌టి, పిహెచ్‌సి అభ్యర్థులకు , ఇతరులకు రూ. 2 వేలు చెల్లించవలసి ఉంటుందని వెల్లడించింది. ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 12 వ తేదీ వరకు , అలాగే ఆలస్య రుసుము రూ. 500లతో 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు www.fcrits.in వెబ్ సైట్‌ను గానీ, ఫోన్ నెం 8074350866 నెంబర్‌లో సంప్రదించవచ్చని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News