డిజిపికి అభ్యర్థన
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దిశా ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈ కేసును విచారణ చేసిన అధికారి విఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
దిశా కేసులో విచారణ అధికారిగా ఉన్న సురేంద్ర విఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. తన అభ్యర్థనను డిజిపి అంజన్‌కుమార్ యాదవ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే విఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన చెబుతున్నప్పటికీ గుర్తింపు లభించడం లేదన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు సురేంద్ర షాద్‌నగర్ ఎసిపిగా ఉండే వారు. తర్వాత ఆ కేసు విచారణ అధికారిగా పని చేశారు. అనంతరం ఆయన్ని ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పిగా బదిలీ చేశారు. ఈ మధ్య కమాండర్ కంట్రోల్ ఎసిపిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇలా గుర్తింపు లేని విభాగాలకు బదిలీ చేయడంపై అసంతృప్తితో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే విఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఇంకా ఆయనకు మూడేళ్ల సర్వీస్ ఉంది.