Sunday, December 22, 2024

ప్రజాపాలనలో దేవుడి పేరిట దరఖాస్తు!

- Advertisement -
- Advertisement -

ప్రజాపాలన దరఖాస్తుల్లో కొందరు దేవుళ్ల పేరు మీద కూడా దరఖాస్తులు అందజేయడం విశేషం. దరఖాస్తుల స్వీకరణ చివరిరోజున భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేంద్రరెడ్డి అనే వ్యక్తి శివుడి పేరు మీద దరఖాస్తు ఇచ్చారు. కుటుంబ సభ్యులుగా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడి పేర్లను పేర్కొన్నారు. దరఖాస్తులో శివయ్య అని పేరు రాసి, పక్కనే వయసు 1200 సంవత్సరాలని పేర్కొనడం గమనార్హం. ఈ దరఖాస్తుకు అధికారులు రసీదు ఇవ్వడం మరొక విశేషం.

ఈ దరఖాస్తు మీడియా కంటబడటం, ఆ తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తప్పు తెలుసుకున్న అధికారులు దరఖాస్తుదారుని పిలిచి నిలదీశారు. దీనిపై దరఖాస్తుదారు సురేంద్ర రెడ్డి అధికారులకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News