మన తెలంగాణ / హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల లా కాలేజీల్లో గెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ కోసం అర్హత, అనుభవం ఉన్న మహిళలు, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. సాంఘీక సంక్షేమ గురుకుల లా కాలేజీ ఫర్ ఉమెన్, గిరిజన గురుకుల లా కాలుజీ ఫర్ మెన్ కాలేజీలు ఇంటిగ్రేటెడ్ బిఎ (ఎల్‌ఎల్‌బి ) 5 సంవత్సరాల కోర్సును అందిస్తున్నాయి. వీటిలో లా (4), పోలిటికల్ సైన్స్ (1), ఎకనామిక్స్ (1), హిస్టరి (1) లైబ్రేరియన్ (2), సోషియాలజి (1) విభాగాల్లో గెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేయనున్నట్లు సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
మహిళా లా కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం మహిళా అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి. గిరిజన గురుకుల లా కాలేజీలో మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఇంటర్వూ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో పిజి కలిగి ఉండాలి. ఎన్‌ఇటి, ఎస్‌ఇటి అర్హత కలిగి ఉండాలి. పిహెచ్‌డి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత నివ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ సివిని మాసాబ్ ట్యాంక్, హైదరాబాద్‌లోని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయానికి వ్యక్తిగతంగా పంపవచ్చు.. మరిన్ని వివరాల కోసం 9666875704 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను జనవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చని తెలిపారు.