Monday, January 20, 2025

సర్టిఫికెట్, డిప్లొమా స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ రిహాబిలిటేషన్ (ఎన్‌బిఈఆర్) 2023-24 అకడమిక్ సెషన్ కోసం ఆర్‌సిఐ ఆమోదించిన సర్టిఫికెట్, డిప్టొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోర్సులకు సంబంధించిన శిక్షణా సంస్థలు, యూనివర్సిటీ డిఫ్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ డిఈపిడబ్లుడి , సిఆర్‌సిఎస్ ద్వారా నేరుగా అడ్మీషన్లు పొందేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ 5న ప్రారంభమైన ప్రవేశ ప్రక్రియ జులై 5 వరకు కొనసాగుతుంది. నిర్ణీత పోర్టల్‌లో అడ్మిట్ అయిన అభ్యర్థుల తుది డేటాను సంబంధిత శిక్షణా సంస్థలకు పంపించడం జరుగుతుంది. మొబైల్, ఇ మెయిల్ ఓటిపి ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థుల డాటాను దృవీకరిస్తారు.

ఎపింక చేయబడిన విద్యార్థుల తుది జాబితా కోర్సుల వారిగా శిక్షణా సంస్థల వారిగా ఆర్‌సిఐ వెబ్‌సైట్‌లో జులై 26న ఉంచడం జరుగుతుంది. అడ్మిట్ అయిన అభ్యర్థులకు జులై 27 నుండి 29 వరకు పిఆర్‌ఎన్ నెంబర్‌ను ఎన్‌బిఈఆర్, ఆర్‌సిఐ ద్వారా కేటాయించడం జరుగుతుంది. ఆగష్టు 1 నుండి అన్ని ఇనిస్టిట్యూట్స్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి 12వ తరగతిలో 50 శాతం మార్కులు కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల మేరకు రిజర్వు క్యాటగిరి అభ్యర్థులకు కనీస మార్కుల్లో మినహాయింపు ఉంటుంది. ప్రవేశాలను అడ్మీషన్ కమిటి నిర్ణయిస్తుంది.

అడ్మీషన్లు ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి, పిడబులడి, ఈడబ్లుస్ క్యాటగిరి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలసీల మేరకు కల్పించడం జరుగుతుంది. ప్రవేశాలకు గడుపు పెంపు అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు. దరఖాస్తు ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. పిడబ్లుడి అభ్యర్థులు యుడిఐడి కార్డులు కలిగి ఉన్నట్లైతే వారికి దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News