Thursday, January 23, 2025

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల సంక్షేమ పాఠశాలలో 6, 7, 8వ తరగతుల్లో (ఇంగ్లిష్ మీడియం) మిగిలిపోయిన సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంజేపీ గురుకులాల కార్యదర్శి ఒక ప్రకటనను విడుదల చేశారు. అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి గౌతమ్‌కుమార్ సూచించారు. http://mjptbcwreis.telangana.gov వెబ్‌సైబ్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్ష మే 5వ తేదీన ఉంటుందని చెప్పారు.
జూనియర్, డిగ్రీ ప్రవేశాలకు..
సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాల కోసం నిర్వహించే ఆర్‌జేసీ సెట్ – 2023కు 2022 , 23లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే ఆర్‌డీసీ సెట్ – 2023కు 2022-23లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వివరాలకు http://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌ను తెరిచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 29వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News