Thursday, January 23, 2025

బిఎస్‌సి (ఆనర్స్ ) ఫారెస్ట్రీ డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అటవీ కళాశాల, పరిశోధన సంస్థ 202304 విద్యా సంవత్సరం బిఎస్‌సి (ఆనర్స్ ) ఫారెస్ట్రీ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు గాను ప్రవేశాలకు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు ప్రవేశ పద్దతి వివరాలు ఇలా ఉన్నాయి. అడ్మిషన్లు ( జీవశాస్త్రం స్ట్రీమ్ 75 శాతం సీట్లు, గణిత స్ట్రీమ్ 25 శాతం సీట్లు ) టిఎస్ ఎంసెట్ 2023 ర్యాంక్‌తో పిసిబి , పిసిఎం, పిసిఎంబి సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తించబడిన ఏదైనా ఇతర సమానమైన పరీక్ష ఆధారంగా ఉంటాయి. ప్రవేశ ఎంపికలో రిజర్వేషన్‌లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి పాటించనున్నారు. కాగా దరఖాస్తు చేసే విధానం ఇలా ఉండనుంది.

ఈ నెల 14 నుండి సూచించిన దరఖాస్తు ఫారం కళాశాల వెబ్ సైట్ www.fcrits.in లో దరఖాస్తు ఫారంనకు కావలసిన సర్టిఫికెట్ కాపీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుంను ఆన్‌లైన్‌లో ఎస్‌సి,ఎస్‌టి,పిహెచ్‌సి అభ్యర్థులకు రూ. 1000 , ఇతరులకు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము లేకుండా జూలై 12 వరకు, అలాగే ఆలస్య రుసుము రూ. 500లతో వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 8074350866, లేదా 8919477851కు గానీ లేదా ఈ మెయిల్ fcriadmissions@gmail.comలో సంప్రదించవచ్చని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (fcri) ఒక ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News