Monday, December 23, 2024

జిల్లా వైద్యశాఖలో ఐదు ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లా పరిధిలోని ఐదు సపోర్ట్ ఇంజనీరింగ్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసేందుకు బిటెక్, ఎంసిఏ, నాలుగు సంవత్సరాల సాంకేతిక సపోర్ట్ అనుభవం కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం చేసేందుకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ ఉదయం 10.30గంటల నుంచి సాయంత్ర 5 గంటలవరకు దరఖాస్తులు తమ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

నోటిఫికేషన్ నియమ నిబంధనలు, దరఖాస్తు పత్రం కోసం వైద్యశాఖ అధికారిక వెబ్‌సైట్ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసుకున్న తరువాత జిల్లా వైద్యశాఖ హైదరాబాద్ జిల్లా ఆపీసులో ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంతో పాటు సంబంధిత దృవపత్రాలను ఈనెల 18వ తేదీన సమర్పించాలని కోరారు. పూర్తి వివరాల కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నాలుగో అంతస్తు, జీహెచ్‌ఎంసీ భవనం, ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్‌లో సంప్రదిదంచాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News