Saturday, December 21, 2024

ఏపిలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్(ఏపి)లో నూతన మద్యం పాలసీలో భాగంగా వైన్ షాపుల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. మద్యం దుకాణాల లైసెన్స్ ల కోసం భారీ స్పందన కనిపించింది. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు 87,116 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 వైన్ షాపుల కోసం 5,764 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా అల్లూరి జిల్లాలోని 40 దుకాణాలకు 1,179 దరఖాస్తులు వచ్చాయి. తిరుపతి జిల్లాలోని 227 మద్యం షాపుల కోసం 3,659 దరఖాస్తులు వచ్చాయి.

కాగా, ఈ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ.1,742 కోట్ల ఆదాయం లభించింది. ఈ నెల 14న లాటరీల ద్వారా మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఈ నెల 15న లైసెన్స్ లు జారీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News