Monday, December 23, 2024

ముత్తూట్ వివాహ సన్మానం ప్రాజెక్టు.. దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థ అయిన ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ముత్తూట్ వివాహ సన్మానం ప్రాజెక్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వితంతువులైన తల్లులకు వారి కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ప్రత్యేక కార్పొరేట్ సేవా బాధ్యత( సిఎస్‌ఆర్) కార్యక్రమం ఇది. డిసెంబర్ నెలాఖరులో హైదరాబాద్‌లో ఈ పోటీ నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి లబ్ధిదారు రూ.50 వేల ఆర్థి సహాయాన్ని ఉదారంగా అందుకుంటారు. హైదరాబాద్, బెంగళూరు, మదురై, మంగళూరు, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వంటి ఎనిమిది నగరాల్లో మొత్త 80 మంది లబ్ధిదారులను అంటే ఒక్కో నగరంనుంచి గరిష్టంగా 10 మంది లబ్ధిదారులను ఇందుకోసం ఎంపిక చేస్తారు. ఈ సహాయం పొందడానికి అర్హత పొందేందుకు లబ్ధిదారుల మొత్త నెలవారీ ఆదాయం రూ.10 వేల కంటే తక్కువ ఉండాలి. ముత్తూట్ వివాహ సన్మానం ప్రాజెక్టు 2023 కోసం సంస్థ రూ.40లక్షల గ్రాంట్‌ను కేటాయించింది.

ఈ సంస్థ ఇప్పటికే వితంతు తల్లుల కుమార్తెల వివాహం కోసం రూ.15 కోట్ల సాయాన్ని అందించింది. వితంతు తల్లులకు ఉదారంగా ఆర్థిక సమాయం అందించడం ద్వారా వారి ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని తాము లక్షంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ముత్తూట్ ఫైనాన్స్ సిఎస్‌ఆర్ హెడ్ బాబు జాన్ మలయల్ తెలిపారు. ఈ గ్రాంట్‌లను పొందడానికి అర్హత ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు అవసరమైన వివాహ ఆహాన పత్రిక లేదా వివాహ తేదీని సూచించే లేఖ, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాపీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పెళ్లి కుమార్తె తల్లి వితంతు లేదా ఒంటరి తల్లి అనిరుజువు చేసే పత్రంతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖను జతపరిచిన అభ్యర్థన లేఖను డిసెంబర్ 25 సాయంత్రం 5.30 గంటలలోగా లక్ష్మీ నారాయణ యమగాని, మేనేజర్ సిఎస్‌ఆర్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, హైదరాబాద్ చిరునామాకు సమర్పించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News