Friday, September 20, 2024

అక్టోబర్ 2 నుంచి రేషన్‌కార్డులకు దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రజల ద్వారా అక్టోబర్ 2నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నాడు సిఎం సచివాలయంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు.ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్‌కార్డులలు ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు.

ఈ అంశంపైన త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించినున్నట్టు తెలిపారు. సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతోపాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపుల్ సెక్రటరీలు రామకృష్ణారావు, వి.శేషాద్రి , కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగీత సత్యనారాయణ, రఘునందన్‌రావు, డి.ఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News