Friday, December 27, 2024

నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: తెలంగాణ గిరిజన సంక్షేమ నాగర్‌కర్నూల్ గురకుల డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డే అండ్ నైట్ వాచ్‌మెన్‌ల నాన్ టీచింగ్ కోర్సులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వారి నుంచి ఉద్యోగ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె. నాగార్జున రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్‌కు బిఎస్సి కంప్యూటర్ సైన్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీ, టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్, నైట్ వాచ్‌మెన్ పోస్టుకు 7వ తరగతి అర్హత కలిగి ఉండాలని,

ఆసక్తి గల వారు మహబూబ్‌నగర్ జిల్లా అప్పన్నపల్లి తిరుమల హిల్స్‌లోని రీజినల్ కో ఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 17 నుంచి దరఖాస్తు ఫారాలను పొందవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు అర్హత కలిగిన దృవీకరణ పత్రాలను జత చేసి జనవరి 24 సాయంత్రం 4 గంటల వరకు అందించాలని ఆయన కోరారు. మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, గిరిజన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 79010 97703, 80745 82331 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News