Thursday, December 19, 2024

పార్ట్ టైం టీచర్ల దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఆంగ్ల మాద్యమంలో బోధించేందుకు పార్ట్ టైం టీచర్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారి మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. మల్లాపూర్ బాలికల విద్యాలయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీజీటీ, తెలుగు, గర్రెపల్లి బాలికల కళాశాలలో ఎకనామిక్స్, హిస్టరీ, పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ బయోసైన్స్, మంథని బాలుర విద్యాలయంలో పీజీటీ తెలుగు, టీజీటీ సోషల్, రామగుండం బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, పీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ, సోషల్, నందిమేడారం బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్, జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, పీజీటీ,గణితం,

పెద్దపల్లి, సుల్తానాబాద్ బాలుర విద్యాలయంలో గణితం, పీజీటీ, ఇంగ్లీష్, టీజీటీ, ఫిజికల్ సైన్స్, పీఈజీ పోస్టులు ఉన్నాయని తెలిపారు. జూనియర్ లెక్చరర్లు, పీజీటీ పోస్టులకు పీజీ, బీఈడీ, టీజీటీ పోస్టకు డిగ్రీ, బీఈడీ, పీఈటీ పోస్టులకు బీపీఈడీ విద్యార్హతలు ఉండాలని, బాలికల విద్యాలయాల్లో మహిళ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. పార్ట్ టైం జూనియర్ లెక్చరర్‌కి రూ.23,400, పీజీటీ/టీజీటీకి రూ.18,200, పీఈటీకి 14,170 నెలవారి పారితోషకం ఉంటుందన్నారు. ఆసక్తి అర్హత కలిగిన వారు ఈనెల 23లోగా రామగుండంలోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న డెమో ఇంటర్వ ఉంటుందని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News