Sunday, February 2, 2025

ఎఫ్‌సిఆర్‌ఐలో పిహెచ్‌డి ప్రవేశాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సిఆర్‌ఐ)లో పిహెచ్‌డి ఫారెస్ట్రీ కోర్స్‌లో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఐకార్, యుజిసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫారెస్ట్రీలో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, తత్సమాన అర్హత కలిగిన వారి నుంచి పిహెచ్‌డిలో చేరేందుకు అర్హులు. ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తులను అందజేయాలని ఎఫ్‌సిఆర్‌ఐ అధికారులు తెలిపారు.

ఎస్‌సి, ఎస్‌టి, పిహెచ్ అభ్యర్థులకు రూ. వేయి, ఇతరులకు రూ.2 వేలు ఆన్‌లైన్ చెల్లించాలని సూచించారు. ఆలస్య రుసుంతో ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపించే వీలుందన్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.fcrits.in, హెల్ప్ లైన్ నంబర్ 8074350866, 8919477851 ఈమెయిల్ : fernadmissions@gmail.com. సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News