Wednesday, January 22, 2025

జ్యోతిబాపూలే గురుకులాల్లో పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల తాత్కలిక భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీసీఓ చెరుకు సుస్మిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో మ్యాథ్స్, ఫిజక్స్, కెమిస్ట్రీ, బాటని, జువాలజీ, పాలిటీ, ఎకనామిక్స్, సివిక్స్, ఇంగ్లీష్, సోషల్, హిందీ, తెలుగు, బయాలజి సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పెద్దపల్లి జిల్లాలోని సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఎడ్ చేసి ఉండాలని, దరఖాస్తులను రంగంపల్లిలోని ఎంజీపీటీబీసీడబ్లు, ఆర్‌ఎస్‌ఎల్ బాలికల కళాశాలలో ఈ నెల 28లోగా సమర్పించాలన్నారు.
మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు: డీసీఓ సుస్మిత
పెద్దపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే మహిళ డిగ్రీ కళాశాలలో చదువుకొనడానికి ఆసక్తిగల విద్యార్థినిలు https://mjpabcweis.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News