Monday, December 23, 2024

స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచే

- Advertisement -
- Advertisement -

Applications for regularization of places will be accepted from today

మీసేవ కేంద్రాల్లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తుల అందుబాటు

2014 జూన్2 నాటికి
ఆక్రమణల్లో ఉన్న వారికి
అవకాశం రెండు రోజుల్లో
విడుదల చేయనున్న ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్ర మించుకొని నిర్మాణాలు చేసుకున్న వారు తమ భూములను క్రమబద్ధీకరించేందుకు నేటి నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖా స్తు చేసుకోవచ్చు. 2014 జూన్2 నాటికే ఆక్రమణల్లో ఉన్నవా టికి ఈ క్రమబద్ధీకరణ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. గతంలో జారీచేసిన జిఒ 58, 59లకు అనుగుణంగా నేటి నుంచి మార్చి 31 వరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఇదే తుది చివరి అవకాశమని ప్రభుత్వం పేర్కొంది. క్రమబద్ధీకరించిన భూములను తరతరాలుగా వారి వారసులు అనుభవించవచ్చని, వేరే వారికి అమ్మడానికి అవకాశం లేదని ప్రభుత్వం సూచించింది. ఈ రెండురోజుల్లో క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే 14వ తేదీన దీనికి సంబంధించి జిఓ నెంబర్ 14ను ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే.

మీసేవలో దరఖాస్తు చేసుకునేటప్పుడు…

1.దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు/ఏదైనా డాక్యుమెంట్)తోపాటు స్థలం తమ అధీనంలో ఉన్నట్టు నిరూపించే ఆస్తిపన్ను రశీదు/విద్యుత్ బిల్లు/తాగునీటి బిల్లు/రిజిస్ట్రర్ డాక్యుమెంట్ వంటి వాటిలో ఏదైనా ఒక దానిని జత చేయాలి.

2.ఖాళీ భూములను క్రమబద్ధీకరించరు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో ఏదో ఒక నిర్మాణం ఉండాలి.

3.ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు.

పెండింగ్‌తో పాటు కొత్తవాటివి కూడా..

గతంలో జారీచేసిన నంబర్58, 59 జిఓల కింద రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 2లక్షల వరకు దరఖాస్తులు పరిష్కారమ య్యాయి. ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వాయిదాల్లో నిర్దేశిత ఫీజును చెల్లించకపోవడం, తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. అయితే మురికివాడల్లో క్రమబద్ధీకరణ చేసుకునే నిర్మాణాలకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలో 10 శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు

అయితే ఎన్ని దరఖాస్తులు, ఏయే కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయన్న వివరాలను ప్రభుత్వం ఇటీవలే అన్ని జిల్లాల నుంచి సేకరించింది. పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆ వివరాలను పరిశీలించి మరోమారు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

58, 59 జీఓల్లోని అంశాలివే..

125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమద్ధీకరిస్తారు.

250 చదరపు గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50 శాతం, 250- నుంచి 500 చదరపు గజాల స్థలాలకు కనీస ధరలో 100 శాతం సొమ్మును ఫీజుగా కట్టాలి.

500 నుంచి 1000 చదరపు గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్న వారు ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. విస్తీర్ణంతో సంబంధం లేకుండా నివాసేతర వినియోగ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఏ దరఖాస్తునైనా ఎలాంటి కారణం చూపకుండానే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

2014లో 125 గజాల లోపు విస్తీర్ణం ఉన్నవి 91,639 దరఖాస్తులు

2014లో 125 గజాల లోపు విస్తీర్ణం ఉన్నవి 91,639 దరఖాస్తులు రాగా, 125 గజాల సౌన విస్తీర్ణానికి సంబంధించి 17,065 దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో జిఓ 58 కింద క్రమబద్ధీకరణ కోసం 3,46,181 దరఖాస్తులు రాగా, క్రమబద్ధీకరణ పోను 2,54,542 మిగిలాయి. జిఓ 59 కింద 48,394 దరఖాస్తులు రాగా, క్రమబద్ధీకరణ పోను 31,329 దరఖాస్తులు మిగిలాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News