- Advertisement -
రైతు బంధు పథకం యాసంగి కోసం కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని పాసుపుస్తకాలు పొందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని సదాశివపేట మండల వ్యవసాయ అధికారి అనిత సూచించారు. భూమి రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకున్నవారు డిసెంబర్ 20వ తేదీ వరకు పట్టాపాసు పుస్తకాలు వచ్చిన రైతులు, తహశీల్దార్ డిజిటల్ సైన్ చేసిన ఆఫీస్ కాపీలు, బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డులను జత చేసి దరఖాస్తులను నింపి వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందజేయాలని ఆయన కోరారు. రైతులు సకాలంలో జిరాక్స్‌లు ఇవ్వక పోతే రైతు బంధు డబ్బులు జమకావన్నారు. రైతులు యాసంగి రైతు బంధు కోసం దరఖాస్తులను సమర్పించాలని ఎఓ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
- Advertisement -