Sunday, September 8, 2024

సైనిక్ స్కూల్ ప్రవేశానికి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: 2024-2025 విద్యా సంవత్సరంలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్‌లో ప్రవేశానికి విద్యార్ధులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. పాఠశాలలో చదివిన బాల, బాలికలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీలలో చేరే విధంగా శిక్షణ ఇస్తారని చెప్పారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్‌లలో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ సిలబస్‌లో 6వ తరగతి, 9వ తరగతిలో చేరే విద్యార్ధులకు ప్రవేశ పరీక్ష 21/1/2024 ఆదివారం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. సైనిక్ స్కూల్ విజయనగరం జిల్లా (ఆంధ్రప్రదేశ్)లో ఆరవ తరగతిలో చేరబోయే విద్యార్ధులకు 31/3/2024 నాటికి 10,12 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలని సూచించారు.

ఖాళీలను అనుసరించి సీట్లు కేటాయిస్తారని ఆమె తెలిపారు. 9వ తరగతిలో చేరు బాల బాలికలు, 31/3/2024 నాటికి 13,15 సంవత్సరాలలోపు వయసు కలిగి, ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ఫీజు జనరల్ విద్యార్ధులు 650 రూపాయలు,ఎస్సీ/ఎస్టీ విద్యార్ధులు 500 రూపాయలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని చెప్పారు. దరఖాస్తులు, ఫీజు ఆన్లైన్ ద్వారా సమర్పించుటకు చివరి తేదీ 16/12/2023 అని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం http://exams.nta.ac.in/AISSEE/వ్బ్సైట్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News