Friday, December 20, 2024

42 టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి 42 రోజుల టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్(టిటిసి) సమ్మర్ ట్రైనింగ్ కోర్సు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్‌లలో మే 1 నుంచి జూన్ 11 వరకు కోర్సు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 20 నాటికి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు అర్హులు అని అన్నారు. అర్హులైన అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి ఈ నెల 20 నుంచి ఆయా జిల్లాల్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News