Monday, December 23, 2024

ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు….

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌కు ఈఏడాది భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో విద్యార్థులు పోటీ పడ్డారు. ఇప్పటివరకు రెండు విభాగాలకు 3,20,310 దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణకు చెందినవి 2, 48,146, ఆంద్రప్రదేశ్‌కు చెందినవి 72,164 ఉన్నాయి. గత ఏడాది 2,66,714 దరఖాస్తులు చేశారు. ఈఏడాది ఒకసారిగా 53,224 దరఖాస్తులు పెరిగాయి. దీంతో అధికారులు పరీక్షల ఏర్పాటుపై ప్లాన్ చేస్తున్నారు. కరోనా సమయంలో రెండేళ్లపాటు విద్యాసంస్ధలు నడవక పోవడంతో పదవ తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరి ఉత్తీర్ణులు చేశారు. వీరంతా ఇంటర్‌లో ఎంపీసీ,బైపీసీ గ్రూపులు తీసుకుని, ఇంటర్ పూర్తి కాగానే ఎంసెట్ రాసేందుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసినట్లు విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

కంప్యూటర్ విద్యపై విద్యార్థులకు మోజు 

చాలా మంది విద్యార్థులు జాతీయ పరీక్షల వైపు వెళ్లకుండా ఇంటర్ పాస్ కాగానే కంప్యూటర్ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారంతా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడంతో ఈసారి 3లక్షలమంది దరఖాస్తులు చేయగా, జేఈఈకి 1.40లక్షల మందే దరఖాస్తు చేశారు. అదే విధంగా గత మూడేళ్ల నుంచి ఇంజనీరింగ్ కళాశాల వైపు విద్యార్థులు రాకపోవడం కళాశాల యాజమాన్యాలు కూడా కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, వీటి స్దానంలో సీఎస్‌సీ, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెల్సిజెన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నారు. దీంతో ఎంసెట్‌లో అర్హత సాధిస్తే ఏదో ఒక కళాశాలలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలకు అనువైన కంప్యూటర్ కోర్సు సీటు వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు. ఎంసెట్‌కు దరఖాస్తులు పెరగడానికి కారణమని మరో వైపు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఎంసెట్ కోసం 21 జోన్లు ఏర్పాటు చేస్తే అందులో 16 జోన్లు తెలంగాణ, 05 జోన్లు ఆంద్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఐదు జోన్లు రాజధాని కేంద్రంగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,48,146 దరఖాస్తులు వస్తే, హైదరాబాద్ నుండి 1,71,300 దరఖాస్తు వచ్చాయి. నగరం చుట్టు పక్కల ఇంటర్ కళాశాలలు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి హాస్టల్ ఉంచి ప్రత్యేక శిక్షణ తీసుకుని ఇక్కడే నుంచే దరఖాస్తులు చేస్తున్నారు. ఈసారి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో పరీక్షలకు హాజరై విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పరీక్ష కేంద్రాలు పెంచుతున్నట్లు జెఎన్‌టియూ విసీ ప్రొపెసర్ కట్టా నర్సింహ్మారెడ్డి తెలిపారు. ఇంటర్‌లో వెయిటేజీ ఎత్తివేయడంతో ఏపి నుంచి దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News