Sunday, January 19, 2025

మహిళా వ్యవసాయ గురుకుల కాలేజీలో… గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన మహాత్మా జ్యోతిబా పూలే బిసి సంక్షేమ మహిళా వ్యవసాయ గురుకుల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి రిటైర్డ్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనా సిబ్బంది నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 9 వరకు దరఖస్తు చేసుకోవాలని బిసి గురుకుల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

వనపర్తి, కరీంనగర్ లో ప్రారంభమైన వ్యవసాయ మహిళా గురుకుల కాలేజీల్లో పనిచేయడానికి అర్హులైన వారు తమ బయోడేటాను mjpadmissioncell@gmail.com కు పంపించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 14, 15 తేదీల్లో డెమో, ఇంటర్వూ నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ http://mjptbcwreis.telangana.gov.in ను సందర్శించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News