Friday, January 24, 2025

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2024 కోసం దరఖాస్తులు జాతీయ అవార్డుల పోర్టల్లో ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ అవార్డులు ఆయా రంగాలలో శౌర్యం, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి ఆవిష్కరణలు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలి. దేశంలో నివసిస్తున్న 18 సంవత్సరాలకు మించని ఏ చిన్నారి అయినా అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వ్యక్తులు ఎవరైనా కూడా అర్హులైన పిల్లలను అవార్డుకు నామినేట్ చేయవచ్చు. పిఎంఆర్‌బి కోసం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పోర్టల్ https://awards.gov.inలో మాత్రమే స్వీకరించబడతాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణకు గడువు ఈనెల 31వ తేదీవరకు ఉందని మరిన్ని వివరాల కోసం నేషనల్ అవార్డ్ పోర్టల్ (https://awards.gov.in) సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News