Sunday, December 22, 2024

క్రైస్తవ మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సహాయానికి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర క్రైస్తవులకు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా వంద శాతం సబ్సిడీ తో రూ. లక్ష రూపాయల ఏదైనా ఒక యూనిట్ నెలకొల్పుకొనుటకు రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. శుక్రవారం ఎండీ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొంటూ దరఖాస్తుదారులు గ్రామీణ ప్రాంతం వారు రూ. 1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతం వారు రూ. 2.00 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలని, వయస్సు 21 నుండి 55 సంవత్సరముల లోపు ఉండాలని సూచించారు. దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా ఓబిఎంఎంఎస్ పోర్టల్ www.tsobmms .gov.in లో ఈనెల 31వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీలోగా చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాల కోసం సంబంధిత జిల్లా మైనారిటీ అధికారి, ఎండి క్రిస్టియన్ కార్పొరేషన్ కార్యాలయంలోని 040-23391067 సంప్రదించాలని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News