- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌరసరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది.
సామాజిక మాధ్యమాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు దరఖాస్తు పూర్తిచేసి ఆధార్ సంఖ్య, కుటుంబ సభ్యుల జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఫోటో జతచేసి స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కు ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ప్రభుత్వం, పౌరసరఫరా శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కుటుంబ డిజిటల్ కార్డుల కోసం దరఖాస్తు కోరలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్. చౌహాన్ ప్రకటన విడుదల చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
- Advertisement -