Monday, December 23, 2024

‘గృహలక్ష్మి’కి పోటెత్తిన దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : పేద, మధ్య తరగతి వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు నివాసం కల్పించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసి అర్హులైన వారు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 7వ తేది నుంచి 10వ తేది వరకు దరఖాస్తులు ఇచ్చేందుకు వీలు కల్పించింది.

దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులు గడువు ఇవ్వడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాలలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు ఫారంతో పాటు ఇంటి స్థలం వివరాలు, కుల ధృవీకరణ, ఆధాయ ధృవీకరణ పత్రం సమర్పించాలని నియమం పెట్టడంతో ధృవీకరణ పత్రాల కోసం తహసిల్దార్ కార్యాలయంలో ప్రజలు చేరుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు.

అదే విధంగా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు ఫారాల కోసం మీ సేవలు, జీరాక్స్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. దరఖాస్తు గడువు మూడు రోజులే ఉండడంతో కుల, ఆధాయ ధృవపత్రాలు పొందేందుకు తహసీల్దార్ కార్యాలయంలో పడిగాపులు గాస్తూ ఇబ్బందులు పడుతున్నామని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహలక్ష్మి పథకానికి మహిళలే అర్హులని నిబంధన ఉండడంతో మహిళల పేరుపై స్థలం లేని వారు పురుషులు కూడా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News