Wednesday, January 22, 2025

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రజవాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాగర్‌కర్నూల్ ఐడిఓసి సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సీతారామారావుతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 101 వినతులు ఆయన స్వీకరించారు.

అందులో 78 దరఖాస్తులు ధరణివి కాగావివిధ శాఖలకు 23 చెందిన దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ధరణిలో వచ్చిన 50 దరఖాస్తులను అప్పటికప్పుడు కలెక్టర్ ఆన్లైన్ ద్వారా పరిష్కరించి సిసిఎల్‌ఏ ఆమోదానికి పంపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజవాణిలో వచ్చిన వాటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సమస్యలు పరిష్కరించి సంబంధిత వెబ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.

తమ పరిధిలో లేని వాటిపై ఫిర్యాదుదారులకు తగు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. తహసీల్దార్లు ధరణి పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్సింగ్ రావు, ఈడిఎం నరేష్, పిఎస్ ఖాజామైనుద్దీన్, డిటి బాలరాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News