Tuesday, December 24, 2024

దరఖాస్తులను పరిశీలించి వేగవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్: మీసేవ కేంద్రాల ద్వారా ధృవపత్రాలకి వస్తున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వేగవంతంగా పరిశీలించి ధృవపత్రాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తహశీల్దార్లకు సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్‌లో చట్టబద్ద ధృవపత్రాల జారీ, ఇంటింటి ఓటరు జాబితా సర్వే, పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు, నూతనంగా పోలీంగ్ కేంద్రాల ఏర్పాటు గుర్తింపుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వర్ సమస్య తీరిందని, రాత్రి సమయంలో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదాయ, కుల, రెసిడెన్షియల్ వంటి ధృవపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన ధృవపత్రాలు జారీ చేయాలన్నారు.

ప్రధానంగా బిసి కులాల వారు ఆర్థిక సాయం నిమిత్తం వివిధ ధృవపత్రాలకు దరఖాస్తు చేసుకున్నవారి,వారికి సరైనవిదంగా స్పందించి సమాధానం ఇవ్వండని సూచించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సమీక్షిస్తూ 22లోగా ఇంటింటి సర్వేపూర్తి చేయాలని బూత్ స్థాయి అధికారులకు సూచించారు. సర్వే సందర్భంగా ఓటరు జాబితానుంచి మరణించిన, షిప్టింగ్ ఆయన వారి పేర్లు తొలగించినట్లయితే ఫారం 6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదుచేయాలని, ఇందుకు సంబంధించి పక్కగా ఫైలింగ్ ఉండాలన్నారు. అదేవిధంగా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలున్న ఇండే ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు.

ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిరంతర ప్రక్రియ అనిఈ సందర్భంగా వస్తున్న ఫామ్6,7,8లను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ వచ్చిన పక్షం రోజులలోగా డిస్పోస్ అయ్యేలా చూడాలన్నారు. 1500పైగా ఓటర్లు ఉన్న బూతులలో కొత్తగా పోలీంగ్ కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించాలని, త్వరలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమై తగు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు పంపుతామని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓలు సాయిరాం, శ్రీనివాసులు, అన్ని మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News