Friday, November 22, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయుటకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Applications to apply to work in TS Government Hospitals

 

ఈనెల 28వ తేదీన అర్హులు ఇంటర్వ్యూకు హజరుకావాలి: వైద్యశాఖ

మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలికంగా మూడు నెలల పాటు ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేయుటకు ఆసక్తిగల అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ల్యాబ్ టెక్నిషియన్ 28, స్పెషలిస్టు వైద్యులు (ఆనస్థీసీయా) 16, స్పెషలిస్టు డాక్టర్ (జనరల్ మెడిసిన్) 13, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 02, స్పెషలిస్టు డాక్టర్ పల్మానాలజీ మెడిసిన్ 08 పోస్టులు భర్తీ చేస్తామని వైద్యాధికారి జి.వెంకటి పేర్కొన్నారు. అర్హతగల అభ్యర్దులు జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడు చేసుకుని పూరించిన దరఖాస్తును ఈనెల 28వ తేదీ ఉదయం 10గంటలకు హరిహర కళాభవన్ సమావేశ మందిరం, ప్యాట్నీ సికింద్రాబాద్‌కు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News