Friday, December 20, 2024

సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు…ఈ నెల 10 లోగా దరఖాస్తుచేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు జులై 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని బిసి ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రేనింగ్ సెంటర్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పరీక్ష కోసం బిసి స్టడీ సర్కిల్ ఉస్మానియా యూనివర్సిటి సెంటర్‌లో ఈ నెల 31 నుండి శిక్షణా తరగతులు ప్రారంభమవుతున్నాయని ఈ తరగతులు ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయని తెలిపారు. మెరిట్ మార్కులు, అకడమిక్ ప్రతిభ ద్వారా మొత్తం 150 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపికచేస్తారు.

50 మంది అభ్యర్థులు నేరుగా 31 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, గతంలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు సంబంధిత పత్రాలతో నేరుగా ఓయూలోని బిసి స్టడీ సర్కిల్ సెంటర్‌కు సంప్రదించాలన్నారు. మిగిలిన 100 మంది అభ్యర్థులు ఈ నెల 16న నిర్వహించే ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడుతారని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతాయన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా చేయాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 04027077929, సెల్ 7780359322 నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News