Sunday, December 22, 2024

ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • 100 రోజుల పని పూర్తయిన కుటుంబాలు అర్హులు
  • ఉచిత భోజన వసతి, మెటీరియల్, స్టైఫండ్ అందజేత
  • దరఖాస్తులను ఎఫ్‌ఏ లేదా ఉపాధి హామీ ఆఫీసులో ఇవ్వాలి: ఏపీఓ లక్ష్మీదేవి

పెద్దేముల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు మండల ంలో అర్హతగల వారు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఓ లక్ష్మీదేవి తెలిపారు. అదివారం ఉచిత శిక్షణకు సంబంధించిన వివరాలను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీఓ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో, గ్రామీణ స్వ యం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో మొయినా బాద్ మండలంలోని చిల్కూ రులో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణా ఇస్తున్నట్లు తెలిపారు.

శిక్షణ పొందడానికి ఉపాధి హమీ పథకంలో గత నాలుగేళ్ళ నుంచి (2019 నుంచి 2023) వరకు గల ఆర్థిక సంవత్స రాలలోని ఏదో సంవత్సరం లో తమ కుటుంబంలోని జాబ్ కార్డులో 100 రోజుల పని పూర్తి చేసిన వారు అర్హులని చెప్పారు. 7వ తరగతి నుంచి మొ దలుకొని పది, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నార న్నారు 19 నుంచి 45 సంవత్సరాల వరకు వయస్సు గల ప్రతిఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

మగ్గం వర్క్, టైలరింగ్, సెల్‌ఫోన్, సీసీ టీవీ, రిఫ్రి జిరేటర్, ఏసీలు, ద్విచక్ర వాహనాల రిపేరింగ్, మోటర్, డ్రైవింగ్, డైరీ ఫాం, కంపోస్టు ఎరువుల తయారీ, ఎలక్ట్రికల్ వర్క్, హౌస్ వైరింగ్, ల్యాండ్ సర్వే, ప్లంబింగ్, ఫిట్టర్, మేషనరీ, వెల్డింగ్, సాయిల్ అండ్ వాటర్ పరీక్షలు, పేయింటింగ్ తదితర విభాగాలతో పాటుగా కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇవ్వను న్నట్లు వివరిచారు. శిక్షణలో భాగంగా ఉచిత భోజ న వసతి, స్టడీ మెటీరియల్‌తో పాటుగా ప్రతిరోజూ రూ.247 చొప్పున స్టయి ఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఆసక్తిగల అభ్యర్థులు నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్, పాన్ కార్డు జిరాక్స్‌లను జతచేసి స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ లేదా ఉపాధి హమీ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News