మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు 202122 సంవత్సరంకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు ఈనెల 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు రిజిష్టర్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై పోస్ట్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 16వేల పోస్ట్ మెట్రిక్ దరఖాస్తులు అందాయని, ప్రీ మెట్రిక్ దరఖాస్తులు 10వేలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
తహాసీల్దార్ల స్దాయిలో పెండింగ్‌లో ఉన్న కుల, ఆదాయ, ధృవీకరణ పత్రాల దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తహాసీల్దార్ల పరిధిలో ఉన్న ఎఎస్‌ఒలు, ఎంఈఓలు, డిప్యూటీ డిఈఓలతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వారం రోజులలో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసేలా డిప్యూటీ డిఈఓలు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో డిడి సోషల్ వెల్పేర్ అధికారి రామారావు, డిఈఓ రోహిణిదేవి, బిసి వెల్పేర్ అధికారి ఆశన్న, గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డిప్యూటీ డిఈఓలు, ఎఎస్‌ఓ తదితరులు పాల్గొన్నారు.