Wednesday, January 22, 2025

సామూహిక వివాహాలకు దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: ఎంజెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12, 2023వ తేదిన నిర్వహిస్తున్న సామూహిక వివాహాలకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల ఆడపిల్లల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని మంతటి గ్రామానికి చెందిన పాదాల వెన్నెల తండ్రి కృష్ణవర్మ సామూహిక వివాహానికి దరఖాస్తు చేసుకుని డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘు నందన్ రెడ్డికి దరఖాస్తు పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, జెడ్పిటిసి శ్రీశైలం, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మాధవ రెడ్డి, నాయకులు భాస్కర్ గౌడ్, గోపి గౌడ్, ఎలిమె సత్యం, పాలమూరు శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News