Friday, December 20, 2024

నేడు స్టాప్‌నర్సులకు నియామక ప్రతాలు అందజేత

- Advertisement -
- Advertisement -

ఎంపికైన వారికి పత్రాలు అందజేయనున్న సిఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో 7094 స్టాప్ నర్సుల ఖాళీలకు నోటిఫికేషన్
6956 మంది ఎంపికైనట్లు వైద్యశాఖ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో నర్సుల ప్రాముఖ్యత గుర్తించి స్టాఫ్ నర్సుల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని నిర్ణయించింది. 7094 పోస్టు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసింది. వారికి బుధవారం సిఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు ఎల్బీస్టేడియంలో అందజేస్తారు. నోటిపికేషన్ ప్రకారం 7,094 స్టాఫ్ నర్సుల పోస్టులలో 6,956 మంది దరఖాస్తుదారులు ఎంపికయ్యారు. ప్రధానంగా ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ కేటగిరీలో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ చేయడం లేదు.
శాఖల వారీగా ఎంపికైన స్టాఫ్ నర్సుల సంఖ్య క్రింది విధంగా ఉంది:

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్:5,571
తెలంగాణ వైద్య విధాన పరిషత్:736
ఎంఎన్‌జె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ , రీజినల్ క్యాన్సర్ సెంటర్:81
వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ:8
తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ:117
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ ః 253
గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ (గురుకులం):68
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ: 109
రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీ:13
స్టాప్‌నర్సుల పోస్టుకు కనీస ప్రాథమిక వేతనం రూ.36,750తో పాటు డిఎ, హెచ్‌ఆర్‌ఏ ఉంటుందని, ఇదివారి కుటుంబాలకు ఆర్థికం సహాయం చేయడంతో పాటు వారికుటుంబాల జీవనప్రమాణాలను పెంచుతుంది. కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సుల జీతాల కోసం నెలకు దాదాపు రూ. 35 కోట్లు ఆర్థిక వ్యయం అవుతుంది. రోగులసంరక్షణసేవలనుఅందించడంలో స్టాప్ నర్సులు కీలక పాత్ర వహిస్తారు. ఆసుపత్రులలో నర్సుల పోస్టులు పెద్దసంఖ్యలో ఖాళీలుఉండడంతో ఈ ఖాళీలుఆసుపత్రుల పనితీరుపైచాలా్ర పతికూలప్రభావం చూపాయి. ఈ ఖాళీలభర్తీతో, ఆసుపత్రుల పనితీరు చాలావరకుపెరుగుతుంది, తద్వారామెరుగైనరోగులవైద్య, ఆరోగ్యసేవలు అందనున్నాయి. నర్సులు రాష్ట్రంలోని ప్రధాన 26 వైద్యకళాశాలలు, ఇతర స్పెషాలిటీ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నియమితులవుతారు. దీంతో అన్నిఆసుపత్రుల్లో స్టాప్ నర్సుల ఖాళీలు భర్తీఅవుతాయి. దీంతో పేదలకు ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందుతాయని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News