Friday, December 27, 2024

శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్ నియామకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను రాష్ట్ర హైకోర్టు నియమించింది.ఈ క్రమంలో ఈనెల 11వ తేదీ లోపు అడ్వకేట్ కమిషనర్ విచారణను పూర్తి చేయనున్నారు. విచారణలో భాగంగా సాక్షుల విచారణతో పాటు ఆధారాలను అడ్వ కేట్ కమిషనర్ పరిశీలించనున్నారని తెలుస్తోంది.

సాక్షులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని, ఈ మేరకు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా అడ్వకేట్ కమిషనర్ ముందు హాజరు అవ్వాల్సిందిగా సాక్షులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో 8వ తేదీన ప్రస్తుత మెదక్ జిల్లా ఆర్డీవో స్టేట్మెంట్‌ను అడ్వకేట్ కమిషనర్ రికార్డ్ చేయనున్నారు. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News