Friday, January 24, 2025

పార్లమెంటు స్థానాలకు బిజెపి ఇంఛార్జీల నియామకం

- Advertisement -
- Advertisement -

8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగింత

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి నేతలు వ్యుహ రచనలు చేస్తున్నారు. సోమవారం ఆ పార్టీ చీప్ కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది కమిటీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పార్లమెంటు పొలిటికల్ ఇంఛార్జీలను బిజెపి ప్రకటించింది. ఇప్పటివరకు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజుకోవాలని ప్రయత్నాలు వేగం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థానాలతోపాటు మరిన్ని ఎంపీ సీట్లలో గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.

పార్లమెంటు ఇన్‌చార్జులు..
హైదరాబాద్: రాజాసింగ్
సికింద్రాబాద్:ఎంపీ లక్ష్మణ్
మల్కాజిగిరి:పైడి రాకేశ్ రెడ్డి
చేవెళ్ల:ఏవీఎన్ రెడ్డి
నిజామాబాద్:ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఖమ్మం:పొంగులేటి సుధాకర్ రెడ్డి
మహబూబాబాద్:గరికపాటి మోహన్‌రావు
పెద్దపల్లి:రామారావు పాటిల్
వరంగల్:మర్రి శశిధర్ రెడ్డి
కరీంనగర్:సూర్యనారాయణ గుప్తా
జహీరాబాద్:కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
మెదక్:పాల్వాయి హరిబాబు
నల్లగొండ:చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి:ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News