Wednesday, January 22, 2025

సెట్లకు కన్వీనర్ల నియమాకం

- Advertisement -
- Advertisement -

Appointment of convenors for TSCETs

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే విశ్వవిద్యాలయాలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసినట్లు చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. సెట్లకు సంబంధించి కన్వీనర్లను శుక్రవారం నియమించారు. జేఎన్టీయూహెచ్‌కు ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యత అప్పగించింది. ఎంసెట్ కన్వీనర్ జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఈ సెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ కె. విజయ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ఓయూకు లాసెట్, పీజీఎల్ సెట్, పీజీ ఈసెట్, నియమించారు. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ ఏ. రామకృష్ణ, పీజీ ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఐసెట్ నిర్వహణ బాధ్యతలు కాకతీయ యూనివర్సిటీకి, ఐసెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ కె. రాజిరెడ్డికి అప్పగించారు. లాసెట్, పీజీ ఎల్ సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ జీబీ రెడ్డి నియమితులయ్యారు. ఈ ప్రవేశ పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News