Monday, December 23, 2024

డిప్యూటీ సిఎంల నియామకం చట్ట విరుద్ధం కాదు: సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డిప్యూటీ సీఎం పదవులపై సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ పదవులపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ డిప్యూటీ సీఎంల నియామకం చట్ట విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా , జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగం లోని ఏ నిబంధనను ఉల్లంఘించడం లేదని సుప్రీం కోర్టు తెలియజేసింది. డిప్యూటీ సిఎంల నియామకాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన పబ్లిక్ పొలిటికల్ పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు ఈ సందర్భంగా కొట్టి వేసింది. కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నారు. మంత్రి వర్గం లోని సీనియర్ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి,

లేదా సంకీర్ణం లోని పార్టీలకు సముచిత స్థానం కల్పించడానికి డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నారు. పేరుకు డిప్యూటీ సిఎం అని పిలిచినప్పటికీ ఆయన కూడా మంత్రివర్గంలో ఒక మంత్రే. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉపముఖ్యమంత్రి మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఉంటారు. ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించేందుకు సీనియర్లకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు చాలా రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకరి కంటే ఎక్కువ ఉపముఖ్యమంత్రులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశం లోని 14 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News