Wednesday, December 25, 2024

తెలంగాణ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ షరీఫ్ నియామకం

- Advertisement -
- Advertisement -

గోషామహల్ : తెలంగాణ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ షేక్ మహమ్మద్ షరీఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం తెలంగాణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ భూక్య శంకర్ నాయక్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సందర్భంగా డాక్టర్ షేక్ మహమ్మద్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వైద్యుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. వైద్యులందరి సహకారంతో వైద్యుల సంఘాన్ని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో తెలంగాణ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు తెలంగాణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ భూక్య శంకర్ నాయక్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News